Thursday, December 19, 2024

అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న ఏడుగురిపై క్రిమినల్ కేసు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ,సిటీబ్యూరో:  జలమండలి డివిజన్2లోని అలియాబాద్ సెక్షన్ పరిధిలో ఉండే గౌలిపురాలోని మేకలమండి ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు తమ నివాసాలకు, భవనాలకు అక్రమంగా 15 ఎంఎం నల్లా కనెక్షన్‌లు తీసుకున్నారు. ఈవిషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌లను తొలగించింది. అక్రమ నల్లా కనెక్షన్‌లు కలిగి ఉన్న ఏడుగురు వ్యక్తులపై ఛత్రినాక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అధికారుల అనుమతి లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్‌కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100 నెంబర్‌కు పోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News