Tuesday, January 21, 2025

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన పది మంది అధికారులపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల విధులు నిమిత్తం నియమించిన అధికారులల్లో శిక్షణకు గైర్హాజరైన వారిపై జి ల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషన ర్ రోనాల్డ్ రోస్ కోరఢా ఝులిపించారు. ఎన్నికల విధులకు సంబంధించి వివిధ శాఖల కు చెందిన మొత్తం 22,500 మంది అధికారులు సిబ్బందిని కేటాయించారు. వీరందరికీ ఎన్నికల విధులకు
సంబంధించి శిక్షణ ఇచ్చారు. అయితే ఇందులో సుమారు 4వేలకు పైగా అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంతో వీరందరికీ మరోసారి శిక్షణ ఏర్పాటు చేశారు.

అయితే రెండవసారి సైతం సుమారు 2వేల పైచిలుకు అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంతో వీరందరిపై క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదేశించారు. ఇందులో భాగంగా గురువారం 10 మంది సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన వారికి ఈ నెల 20 వ తారీకున మరోసారి శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, దీనికి గైర్హాజరైతే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చ రించారు.

క్రిమినల్ కేసు నమోదైన సిబ్బంది వివరాలు
సయ్యద్ ఇలియాస్ అహమ్మద్, జూనియర్ అసిస్టెంట్, (సిఆర్‌సిఎస్ విభాగం), జి .రవి ప్రసాద్,సీనియర్ అసిస్టెంట్ (ఓయు మెయిన్ క్యాంపస్), డా.జె. కృష్ణయ్య,అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఓయు), మజీద్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్(స్కూల్ ఎడ్లికేషన్), మీర్జా నసీర్ బేగ్ స్కూల్ అసిస్టెంట్(స్కూల్ ఎడ్యుకేషన్).కె .నాగరాజు( కమర్షియల్ టాక్స్), కె. మధు సూధన్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ (,కమర్షియల్ టాక్స్), సయ్యద్ అబ్దుల్లా జుబేర్,టీచర్,(టిఎంఆర్‌ఈఐఎస్), కె.మహేష్ జూనియర్ అసిస్టెంట్, (టిఎంఆర్‌ఈఐఎస్), చిలివేరి శంతన్ కుమార్,సీనియర్ అసిస్టెంట్ ,( ఆర్ అండ్‌బి) మొత్తం 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News