Friday, November 15, 2024

‘శ్రీమంతుడు’ సినిమా.. కొరటాల శివపై క్రిమినల్ కేసు

- Advertisement -
- Advertisement -

దర్శకుడు కొరటాల శివ తన ‘శ్రీమంతుడు’ సినిమాపై సుప్రీంకోర్టులో కేసు వేసిన కారణంగా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. కొరటాల శివ క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం తెలిపింది. కొరటాల శివ తన కథను కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు. స్వాతిలో వచ్చిన తన కథలో ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని వాదించారు. రచయిత శరత్ చంద్ర పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై కోరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు.

కథను కాపీ కొట్టారనేందుకు శరత్ చంద్ర ఆధారాలు సమర్పించారు. శరత్ చంద్ర ఆధారాలను నిర్ధరిస్తూ రచయితల సంఘం నివేదిక విడుదల చేసింది. రచయితల సంఘం నివేదికను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. నాంపల్లి కోర్టు ఉత్తర్వులనే సమర్ధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కొరటాల శివ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. విచారణ జరపడానికి ఏమీ లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ వెనక్కి తీసుకోకపోతే డిస్మిస్ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో కొరటాల శివ తరుపు న్యాయవాది పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News