- Advertisement -
హైదరాబాద్: జలమండలి ఓఅండ్ ఎం డివిజన్10ఏలోని సాహేబ్‌నగర్ సెక్షన్ పరిధిలో ఉన్న వనస్దలిపురం శ్రీరమణ కాలనీ రోడ్ నెంబర్4లో నివసించే పర్వత్‌సింగ్ అనే వ్యక్తి తన భవనానికి 15ఎంఎం పైపు సైజు నల్లా కనెక్షన్‌ను అక్రమంగా తీసుకున్నాడు. బుధవారం ఈవిషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌ను తొలగించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న పర్వత్‌సింగ్‌పై మీర్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అధికారుల అనుమతిలేకుండా అక్రమ నల్లా కనెక్షను తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్‌కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు.
- Advertisement -