Monday, January 20, 2025

కొత్త చట్టం కింద పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు

- Advertisement -
- Advertisement -

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. భారత్ సంహిత్ న్యాయ్(బిఎస్ఎన్) యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న కరీంనగర్  జిల్లా పరిషత్ సమావేశం అనంతరం కలెక్టర్ ను బయటకు వెళ్లకుండా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు.

తన అనుచరులతో అడ్డుగా బైఠాయించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే తీరుపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బిఎస్ఎన్ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News