Monday, December 23, 2024

యుపిలో 3వ దశ … 135 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

Criminal cases against 135 candidates in UP

 

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 20న మూడోదశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో పోటీ చేస్తున్న 627 మందిలో 135 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎన్నికల వాచ్‌డాగ్ ఏడీఆర్ వెల్లడించింది. సమాజ్‌వాది అభ్యర్థుల్లో అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదయినవారున్నారు. ఎస్పీలో 30 మంది, బీజేపీలో 25 మంది, బీఎస్పీలో 23 మంది, కాంగ్రెస్‌లో 20 మంది, ఆప్‌లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలియజేసింది. అలాగే ఎస్పీ నుంచి 21, బీజేపీ నుంచి 20, బీఎస్పీ నుంనచి 18, కాంగ్రెస్ నుంచి 10, ఆప్ నుంచి 11 మందిలో సీరియస్ క్రిమినల్ కేసులు నమోదైనట్టు ఏడీఆర్ వెల్లడించింది. మూడవ దశలో పోటీ పడుతున్న వారిలో 245 మంది కోటీశ్వరులున్నారు. ఎస్పీలో 58, బీజేపీలో 48, బీఎస్పీలో 46, కాంగ్రెస్‌లో 29,ఆప్‌లో 18 మంది కోటీశ్వరులున్నారు. వీరివద్ద కోటి కన్నా ఎక్కువ ఆస్తి ఉంది. ఎస్పీ నేత యశ్‌పాల్ సింగ్ యాదవ్ 70 కోట్లతో సంపన్నుడిగా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News