Monday, December 23, 2024

17 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

రాయపూర్: కొత్తగా ఎన్నికైన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 17 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో ఆరుగురిపై తీవ్ర నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 54 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది. గోండ్వానా గణతంత్ర పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా..నాన్ ప్రాఫిట్స్ ఛత్తీస్గఢ్ ఎలెక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నివేదిక ప్రకారం కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేలలో 17 మంది(సుమారు 19 శాతం) తమపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్లలో ప్రకటించారు.

వీరిలోఆరుగురు(7శాతం) తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పేర్కొన్నారని నివేదిక తెలిపింది. బిజెపికి చెందిన 54 మంది ఎమ్మెల్యేలలో 12 మంది(22 శాతం), కాంగ్రెస్‌కు చెందిన 35 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా బిజెపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు(7 శాతం), కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేంద్ర యాదవ్, అటల్ శ్రీవాస్తవ్ తదితరులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News