Wednesday, January 22, 2025

తెలంగాణలో 521మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 521మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా కాంగ్రెస్ కు చెందిన 85 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, తెలంగాణ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడైంది.

మొత్తం 2,290మంది అభ్యర్థులలో 355 మంది జాతీయ పార్టీలకు చెందినవారు కాగా, 175మంది ప్రాంతీయ పార్టీలకు, 771మంది గుర్తింపుపొందని పార్టీలకు చెందినవారు, మరో 989 మంది ఇండిపెండెంట్లుగాను పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సంబంధించి చూస్తే, బీఆర్ఎస్ టికెట్ పై 119మంది పోటీలో ఉండగా 57మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీజేపి అభ్యర్థులు 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా 79మందిపైన, 118 స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులలో 85మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొత్తం అభ్యర్ధులలో 45మందిపై మహిళలతో  జరిగిన వివాదాలకు సంబంధించిన కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరిలో ముగ్గురు అత్యాచార కేసులలో అభియోగాలు ఎదుర్కుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News