Thursday, January 16, 2025

హైడ్రా దూకుడు… ఆరుగురు అధికారులపై కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైడ్రా సిఫార్సుతో అధికారులపై సైబరాబాద్ సిపి కేసులు నమోదు చేశారు. చెరువుల్లో కట్టడాలకు అనుమతులిచ్చిన ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ ఇఒడబ్ల్యు వింగ్‌లో సిపి అవినాష్‌ మహంతి కేసులు నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ,  చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుదామ్షు, బాచుపల్లి ఎంఆర్ఒ పూల్‌ సింగ్‌, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్‌ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండిఎ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్‌కుమార్‌, హెచ్ఎండిఎ సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సు మేరకు ఎఫ్ టిఎల్ లో అనుమతులు ఇచ్చిన ఆరుగురు అధికారులపై కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News