సుప్రీం కోర్టు సూచన
న్యూఢిల్లీ : జర్నలిస్టుల రచనలను ప్రభుత్వంపై విమర్శగా పరిగణించిన మాత్రాన వారిపై క్రిమినల్ కేసులు పెట్టరాదని సుప్రీం కోర్టు శుక్రవారం అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవిస్తుంటారని, జర్నలిస్టుల హక్కులకు రాజ్యాంగం 19 (1)(ఎ) అధికరణం కింద రక్షణ ఉందని న్యాయమూర్తులు హృషీకేశ్ రాయ్, ఎస్‌విఎన్ భట్‌తో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ విచారణ జరిపింది. ఉత్తర ప్రదేశ్‌లో ‘సాధారణ పాలన యంత్రాంగంలో కుల లక్షణాలు’పై ఒక వార్త ప్రచురించారన్న ఆరోపణపై రాష్ట్రంలో తనపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయ్ కోరారు. అతని పిటిషన్‌పై స్పందన కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి బెంచ్ ఒక నోటీస్ జారీ చేస్తూ, ‘ఈ లోటా సదరు వ్యాసం సందర్భంగా పిటిషనర్‌పై నిర్బంధ చర్యలు తీసుకోరాదు’ అని ఆదేశించింది. కోర్టు నాలుగు వారాల తరువాత ఈ విషయమై విచారణ జరుపుతుంది.
ప్రభుత్వంపై విమర్శగా భావించి జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టరాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -