Tuesday, March 4, 2025

మరోసారి చిక్కుల్లో పడ్డ ఎంఎల్ఎ రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  గోషామహాల్ ఎంఎల్‌ఎ టి. రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎంఎల్‌ఎగా ఆయన ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ను బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్‌ఎ ప్రేమ్ సింగ్ రాథోడ్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇవ్వలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో రాజాసింగ్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ప్రేమ్ సింగ్ రాథోడ్ ఆశ్రయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి బిజెపి తరపున పోటీ చేసి విజయం సాధించిన రాజాసింగ్, తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపర్చలేదని పిటిషన్‌లో రాథోడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News