Monday, January 20, 2025

పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ డిఫమేషన్ కేసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్ వ్యవస్థపైన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన విజయవాడ సివిల్‌కోర్టులో క్రిమినల్ డిఫమేషన్‌ కేసు దాఖలైంది. వలంటీర్ దాఖలు చేసిన పిటీషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకంరించారు . పవన్‌పైన పిటీషన్ దాఖలు చేసిన వలంటీర్ నుంచి శుక్రవారం నాడు న్యాయమూర్తి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వలంటీర్ల పైన పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలవల్ల ్ల మానసిక వేదనకు గురయ్యానని ,న్యాయం చేయాలని మహిళా వలంటీర్ కోర్టును ఆశ్రయించారు.వలంటీర్ తరపును లాయర్లు కేసు దాఖలు చేశారు. సెక్షన్ 499,500,504,505 ప్రకారం కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత వలంటీర్ న్యాయస్థానాన్ని అభ్యర్దించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News