Wednesday, January 22, 2025

పాట్నా కోర్టులో నిందితుడు కాల్చివేత

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని స్థానిక కోర్టులో శుక్రవారం ఒక విచారణ ఖైదీని ఇద్దరు వ్యక్తులు పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. షికందర్‌పూర్ నివాసి అభిషేక్ కుమార్ అలియాస్ చోటే సర్కార్‌పై హత్యారోపణలతోసహా అనేక ఇతర ఇతర కేసులు ఉన్నాయి. నగరంలోని బియూర్ జైలులో ఉన్న అతడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచడానికి తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దానాపూర్ కోర్టుకు తీసుకువెళుతుండగా ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా అతనిపై కాల్పులు జరిపినట్లు పాట్నా వెస్ట్ ఎస్‌పి రాజేష్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలం నుంచి నాలుగు బులల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. కోర్టు ప్రాంగణంలో వాతావరణం ఉద్రిక్తంగా ఉందని వారు చెప్పారు. కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు ఎస్‌పి చెప్పారు. నిందితులు ముజఫర్‌పూర్‌కు చెందినవారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News