Monday, December 23, 2024

సోషల్ మీడియాలో చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రోనాల్డో

- Advertisement -
- Advertisement -

పోర్చగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు.తన సోషల్‌ మీడియా ఖాతాలన్నింటిలో 100 కోట్ల ఫాలోవర్స్ ను సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం రొనాల్డో ఇన్‌స్టాలో 63.9కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ‘ఎక్స్‌’లో 11.3 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 17 కోట్ల మంది, యూట్యూబ్‌ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి రోనాల్డే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసిన రోనాల్డ్ తన అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ప్రత్యేక పోస్ట్‌ పెట్టాఉడు.

‘మనం చరిత్ర సృష్టించాం.. 100కోట్ల ఫాలోవర్లు!..ఇది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించిన మీ ప్రేమాభిమానాలకు నిదర్శనం. మడైరా వీధుల నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వేదికల వరకు.. నేను ఎల్లప్పుడూ నా కుటుంబంతో పాటు మీ కోసమే ఆడాను. ఇప్పుడు వంద కోట్ల మంది నాకోసం నిలబడ్డారు.నాపై విశ్వాసం ఉంచి.. నాకు ఎల్లవేళలా అండగా ఉన్నందుకు.. నా జీవితంలో భాగమైనందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న’’ అని రొనాల్డో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News