Saturday, December 21, 2024

మైదానంలో వెక్కివెక్కి ఏడ్చిన ఫుట్​బాల్​ దిగ్గజం రొనాల్డో

- Advertisement -
- Advertisement -

ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ లో సాకర్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్ పోరాటం ముగిసింది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో 1-0 తో పోర్చుగల్ ను ఓడించింది. ఈ మెగా టోర్నీలో సెమీస్ లో అడుగు పెట్టిన తొలి ఆఫ్రికన్ టీమ్ గా రికార్డులకెక్కింది. స్టార్ ప్లేయర్ యూసెఫ్ ఎన్ నెస్రీ 42వ నిమిషంలో హెడ్డర్‌తో అద్భుత గోల్ చేసి మొరాకోకు చారిత్రక విజయం అందించాడు. దాంతో పాటు ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో గోల్ సాధించిన నాలుగో ఆఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఎమ్మాన్యూయెల్ కుంబే, ఎగుని కెకీ (కామెరూన్ 1990), సులే మంటారీ (ఘనా 2010) సరసన చోటు సంపాదించాడు.

పూర్తి ఆత్మవిశ్వాసంతో 90 నిమిషాలు ఆడిన మొరాకో ప్లేయర్లు,  పోర్చుగల్ పని పట్టారు. దీంతో 1966, 2006లో  తర్వాత సెమీస్ చేరాలని ఆశించిన పోర్చుగల్‌కు, కెరీర్‌లో వెలితిగా ఉన్న కప్పు అందుకోవాలని ఆశించిన రొనాల్డోకు నిరాశ తప్పలేదు.   ప్రిక్వార్టర్స్‌లో రొనాల్డోను చాలాసేపు బెంచ్‌పై ఉంచి రమోస్‌ను ఆడించి హిట్ కొట్టిన పోర్చుగల్ ఈసారి కూడా అదే చేయబోయి బోల్తా కొట్టింది. 50 నిమిషాల పాటు రొనాల్డోను బెంచ్ పై ఉంచి కోచ్ తప్పు చేశాడు. జట్టు ఓటమితో రొనాల్డో తీవ్ర కలత చెందాడు. వెక్కివెక్కి ఏడుస్తూ మైదానం వీడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News