- Advertisement -
న్యూఢిల్లీ: కోర్టులు వెలువరించే తీర్పులను విమర్శిస్తే నష్టం లేదు కానీ, వ్యక్తిగత కారణాలతో జడ్జిలను విమర్శించడం సరికాదని సుప్రీంకోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు. ఆగస్ట్ 27న ప్రస్తుత సిజెఐ ఎన్వీ రమణ నుంచి యూయూ లలిత్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జడ్జిలు కేవలం వారి తీర్పులు, ఉత్తర్వుల ద్వారా మాత్రమే మాట్లాడతారన్నారు. కనుక విమర్శలు కేవలం తీర్పులపై మాత్రమే ఉండాలన్నారు. ఎవరైనా సరే తీర్పులను మాత్రమే చూడాలని, వాటి వెనుకున్న జడ్జీలను చూడరాదన్నారు. తీర్పులపై కౌంటర్ వేసే అవకాశం కూడా ఉంటుందన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, వీటిపై న్యాయమూర్తులు వెంటనే ప్రతిస్పందించకపోవడాన్ని బలహీనతగా చూడకూడదన్నారు.
- Advertisement -