Thursday, January 23, 2025

పాక్ టీమ్‌పై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

కరాచీ: భారత్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ టీమ్‌పై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తాయి. కనీస ప్రతిఘటన కూడా ఇవ్వకుండానే చేతులెత్తేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోర వైఫల్యం చవిచూడడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా జట్టు ఇలాంటి చెత్త ప్రదర్శన చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. గెలవాలనే కసి ఆటగాళ్లలో కనిపించలేదన్నాడు. ఇక బ్యాటింగ్‌లో విఫలమైన కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై కూడా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. బాబర్ వైఫల్యం జట్టు కొంప ముంచిందన్నాడు. పిచ్ నుంచి సహకారం లబించినా బౌలర్లు విఫలం కావడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News