Sunday, January 19, 2025

వార్న్‌ను కించపరుస్తూ ట్విట్.. గవాస్కర్‌పై వెల్లువెత్తిన విమర్శలు..

- Advertisement -
- Advertisement -

Criticism of Sunil Gavaskar as social media platform

ముంబై: టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వార్న్ మృతిపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపిన విషయం తెలిసిందే. వార్న్ మృతిపై స్పందిస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అంతేగాక భారత మాజీ క్రికెటర్లు, నెటిజన్లు సయితం గవాస్కర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. వార్న్ మృతిపై స్పందిస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. వార్న్ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూనే అతన్ని దిగ్గజ క్రికెటర్‌గా పేర్కొనలేనని వ్యాఖ్యానించాడు. వార్న్ ఒక సాధారణ బౌలర్ మాత్రమేనని గవాస్కర్ పేర్కొన్నాడు. అయితే ఓ క్రికెటర్ మృతికి సంతాపం తెలుపుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనీ నెటిజన్లు, క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దిగ్గజ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న గవాస్కర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇక భారత్‌తో పాటు ఆస్ట్రేలియా మీడియాలోనూ గవాస్కర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News