Thursday, January 23, 2025

ప్రజలను ఫూల్ చేసే తంతుల్లో ఇదొక్కటి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు అత్యంత వ్యూహాత్మకంగా మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకువచ్చిందని కాంగ్రెస్, ఆప్ ఇతర ప్రతిపక్ష పార్టీలు మంగళవారం విమర్శించాయి. మహిళా ఓటర్లను గేలిచేసేందుకు ఈ బిల్లు తీసుకువచ్చారని, ముందస్తు చర్యలు లేకుండా మొక్కుబడిగా బిల్లు తీసుకురావడం మాయోపాయం కాకుండా ఏమవుతుందని కాంగ్రెస్, ఆప్ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు. ఆప్ నాయకురాలు అతిషి స్పందిస్తూ ఇది మోడీ మహిళలను ఫూల్ చేయడంగానే భావించాల్సి ఉంటుందన్నారు. బిల్లు తద్వారా వచ్చే చట్టంతో కలిగే ప్రయోజనాలు మహిళకు ఎప్పటికి అందేను? అని కాంగ్రెస్ విమర్శించింది.

అమలు ఆలస్యం అయ్యే బిల్లును తీసుకువచ్చి చేసేదేముందని ప్రశ్నించారు. 2026 తరువాతనే బిల్లు ద్వారా మహిళకు న్యాయం దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైనా బిల్లు తీసుకురావడం మంచిదే అయితే , అమలుకు సంబంధించిన కార్యాచరణపై స్పష్టత ఏదని ప్రశ్నించారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో మహిళకు కోటా ఉంటుందా? చెప్పాలని ఓ టీవీ చర్చాగోష్టిలో ఆప్ ఆతిషి ప్రశ్నించారు. తరువాత ఎప్పుడో బిల్లు అమలులోకి వస్తే ఇప్పుడు తీసుకురావడం ప్రజలను ప్రత్యేకించి మహిళను ఫూల్ చేయడం అవుతుందని తెలిపారు.

బిల్లుకు పార్టీ మద్దతు ఉంటుంది. అయితే ఇది ప్రవేశపెట్టిన తీరు హిపోక్రసీనే అవుతుందన్నారు. బిజెపి బ్రిజ్ భూషణ్ పార్టీ అని , ఆయనలాగానే బిజెపి ఇప్పుడు దేశ మహిళను కించపర్చిందని మండిపడ్డారు. భారతీయ మహిళా సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్‌భూషణ్ బిజెపి ఎంపిగా ఉన్నారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే అభియోగాలు ఆయనపై ఉన్నాయి. లోపాలతో ఉన్న బిల్లుతో ప్రయోజనం ఏముందని హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఒవైసీ విమర్శించారు. ఈ బిల్లు తేనైతే తెచ్చారు కానీ లింగపరమైన న్యాయం, ఇదే దశలో సామాజిక న్యాయం మధ్య సమతూకత అవసరం అని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. బిల్లు మంచిదే అయితే దీనిలో బిసిలు, దళితులు, గిరిజన ఆదివాసీ మహిళకు నిర్థిష్ట స్థాయిలో వాటాను స్పష్టం చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News