Tuesday, February 25, 2025

పాక్ టీమ్‌పై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

కరాచీ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ ఆట చాలా ఘోరంగా ఉందని విమర్శించారు. ఇలాంటి టీమ్‌తో భారత్ వంటి బలమైన జట్టును ఎలా ఓడిస్తారని మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, దానిష్ కనేరియా, షోయబ్ అక్తర్ తదితరులు ప్రశ్నించారు.

ఆతిథ్య జట్టు ఇలాంటి పేలవమైన ప్రదర్శన చేయడం ఏంటనీ వారు ప్రశ్నిస్తున్నారు. భారత్‌తో మ్యాచ్‌లో విఫలమైన సీనియర్ ఆటగాడు బాబర్ ఆజమ్‌పై వీరు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. భారత్‌తో పోరులో ఒక్కసారి కూడా బాబర్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని ఆరోపించారు. బ్యాటింగ్ వైఫల్యం జట్టు పరాజయానికి ప్రధాన కారణమని వారు పేర్కొన్నారు. వరుస ఓటములతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా చేసుకోవడం బాధించే అంశమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News