Sunday, December 29, 2024

టీమిండియా ఎంపికపై విమర్శల వర్షం

- Advertisement -
- Advertisement -

ముంబై: టి20 ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్‌లో లేని హార్దిక్ పాండ్యను వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. అంతేగాక సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడుతున్న రిషబ్ పంత్‌ను ఎంపిక చేయడాన్ని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను పక్కన పెట్టడంపై ఆకాశ్ చోప్రా, శ్రీకాంత్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక యువ ఆటగాడు రింకూ సింగ్‌ను మెగా టోర్నీకి ఎంపిక చేయక పోవడాన్ని కూడా వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అక్షర్ పటేల్ స్థానంలో రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకోవాల్సిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫామ్‌లో లేని జడేజా, సిరాజ్‌లను ఎంపిక చేయడం కూడా సబబు కాదని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News