Saturday, November 23, 2024

విద్యుత్ శాఖపై విమర్శలు తగవు

- Advertisement -
- Advertisement -

 

Criticisms of power sector are inappropriate

తెలంగాణ చొరవ వల్లనే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ధరను రూ.20 నుంచి రూ.12కి తగ్గించింది: అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగానే రాష్ట్రాలు కొనుగోలు చేసే విద్యుత్ ధరలను కేంద్రం తగ్గించిందని తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. పీక్ అవ ర్స్‌లో యూనిట్ రూ.20లుగా గతంలో కేం ద్రం నిర్ణయించింది. అయితే ఈ ధరలు తెలం గాణ వంటి రాష్ట్రానికి మోయలేని భారంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించా లని కేంద్రానికి లేఖ రాసింది. దరిమిలా యూ నిట్ విద్యుత్ ధరను రూ.12 లకు తగ్గిస్తూ కేంద్రం ప్రభుత్వం, సిఇఆర్‌సి నిర్ణయం తీసు కున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో ఎక్కడ కూడా యూనిట్ ధర మూడు రూపా యలు లేదని, కేంద్రం నిర్ణయించిన యూనిట్ రూ.20 ప్రకారమే విద్యుత్ కొనుగోళ్ళు జ రుగుతూ వచ్చాయని తెలిపారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా విద్యుత్ శాఖపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని సీనియర్ అధికా రులు అన్నారు. రాజకీయాల కోసం ఎలాంటి విమర్శలు చేసుకున్నా అవి సాంకేతిక పరమై న అంశాలపై ఆధారపడి పనిచేసే విద్యుత్ శా ఖ వంటి ఇంజనీరింగ్ విభాగాలపై ఉండరా దని అన్నారు. నిరాధార ఆరోపణుల చేస్తే ఈ శాఖల్లో పనిచేసే అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, దయచేసి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాజకీయ నేతలకు సూచించారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్‌టిపిసి) వంటి సంస్థలే సగటున ఆరు రూపాయలకు పైగానే విద్యుత్ ను అమ్ముతున్నాయి. ఎన్‌టిపిసి కుడిగి నుంచి యూనిట్ విద్యుత్ ధర 7.63 రూపాయలకు, ఎన్‌టిపిసి వల్లూరు నుంచి యూనిట్ విద్యుత్‌ను రూ.5.78 లకు తమిళనాడులోని ఎన్‌ఎల్‌సి విద్యుత్ సంస్థ నుంచి యూనిట్ విద్యుత్తును రూ.5.23 లకు కొనుగోలు చేశామని విద్యుత్ శాఖ అధికారులు వివరించారు. ఈ తరహా విద్యుత్ కొనుగోళ్ళన్నీ కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి (సిఇఆర్‌సి) నిబంధనల మేరకే జరగాయని తెలిపారు. విద్యుత్తు సరఫరా చేసే పీక్ అవర్స్‌లో 15 నిముషాలకు ఒక సారి ధరలలో అనేక మార్పులు వచ్చాయని ఆ మార్పులు కూడా సిఇఆర్‌సి నిబంధనల మేరకే జరిగాయన్నారు. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు గరిష్టంగా యూనిట్ విద్యుత్తును 20 రూపాయల వరకు అమ్ముకోవచ్చుననే నిబంధనను కూడా కేంద్ర ప్రభుత్వ సిఇఆర్‌సి ప్రవేశ పెట్టిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

విద్యుత్తు డిమాండ్ ఉదయం సాయంత్రం పీక్ అవర్స్‌లో యూనిట్ ధరలు 20 రూపాయలకు కూడా ధరలు పలికాయని తెలిపారు. దేశవ్యాప్తంగా – 2021 అక్టోబర్ లో సగటు యూనిట్ విద్యుత్ ధర రూ.8.01 పలికిందని, పీక్ అవర్స్‌లో రూ.20 ధర పలికిందని తెలిపారు. 2022 మార్చిలో సగటు యూనిట్ విద్యుత్తు ధర దేశవ్యాప్తంగా రూ.8.23 లకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని, పీక్ అవర్స్‌లో రూ.20లు ధర పలికిందని వివరించారు. గత ఏప్రిల్ (2022) వేసవి సీజన్ కావడంతో సగటు యూనిట్ విద్యుత్ ధర రూ.10.06 కాగా పీక్ అవర్స్‌లో రూ.12లు పలికిందని, మే నెలలో సగటు యూనిట్ విద్యుత్తు ధర రూ.6.76 పలికిందని, పీక్ అవర్స్‌లో రూ.12లకు విద్యుత్తు కొనుగోళ్ళు దేశవ్యాప్తంగా జరిగాయని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు నియంత్రణ మండలి నిబంధనల మేరకే జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News