Thursday, December 19, 2024

కొత్త టెలివిజన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన క్రోసిన్ పెయిన్ రిలీఫ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: హేలియన్‌కు చెందిన నొప్పి ఉపశమనపు అనాల్జెసిక్ బ్రాండ్ అయిన క్రోసిన్ పెయిన్ రిలీఫ్, తన కొత్త టీవీ వాణిజ్య ప్రకటనను ప్రసారం చేస్తుంది. ఖాళీ కడుపుతో క్రోసిన్ పెయిన్ రిలీఫ్ తీసుకోవడం సురక్షితమేనన్న సందేశానికి ఇది ప్రాధాన్యత ఇస్తోంది. తలనొప్పితో బాధపడుతున్న కథానాయకుడిని రక్షించేందుకు, సమర్థవంతమైన ఉపశమనాన్ని అందించేందుకు మరియు అతని కడుపును మృదువుగా ఉంచేందుకు క్రోసిన్ పెయిన్ రిలీఫ్ ఎలా వస్తుంది అనే కథనం చుట్టూ దీన్ని నిర్మించారు. క్రోసిన్ పెయిన్ రిలీఫ్ అనేది 650 మి.గ్రా. పారాసెటమాల్ మరియు 50 మి.గ్రా. కెఫిన్ కలయిక. ఇది తలనొప్పికి ప్రభావవంతమైన, ఇంకా సున్నితమైన నివారణ.

పారాసెటమాల్ వినియోగానికి సంబంధించి వినియోగదారులకు పలు అపోహలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఔషధం తీసుకోవడం అలాంటి అపోహల్లో ఒకటి. పారాసెటమాల్ కడుపుపై మృదువుగా ఉంటూ, ప్రేగుల పొరకు చికాకు కలిగించదు. కనుక, దీన్ని ఖాళీ కడుపుతో కూడా తీసుకోవచ్చు. డాక్టర్ టి.శంకర్, ఎం.ఎస్. ఈఎన్‌టి మాట్లాడుతూ, ‘‘భారతీయుల ఇళ్లలో అత్యంత విశ్వసనీయమైన ఔషధాలలో పారాసెటమాల్ ఒకటి. పారాసెటమాల్ భద్రతను అందిస్తూ, సమర్థవంతంగా పని చేస్తుంది. ఇది తలనొప్పి వంటి అనేక పరిస్థితుల చికిత్సకు సరైనదని పరిగణిస్తుండగా, దీన్ని ఖాళీ కడుపుతో కూడా ఉపయోగించుకోవచ్చు’’ అని తెలిపారు.

Crocin pain Relief launches New TV Campaign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News