Wednesday, January 22, 2025

మొసలి దాడిలో రైతు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: మొసలి దాడిలో రైతు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లకిమ్‌పూర్ ఖేరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుధ్వా టైగర్ రిసర్వ్ ఫారెస్ట్‌లో సర్జీత్ గౌతమ్ అనే రైతు మరో రైతుతో కలిసి తన గ్రామ సమీపంలో ఉన్న వాగును దాటుతున్నప్పుడు అతడిపై మొసలి దాడి చేసింది. వెంటనే మొసలి సర్జీత్‌ను నీటిలోకి తీసుకెళ్లింది. మరో వ్యక్తి మొసలిపై రాళ్లతో దాడి చేయడంతో సర్జీత్‌ను వదిలిపెట్టింది. వెంటనే సర్జీత్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని వెల్లడించారు. సర్జీత్‌కు భార్య ఆరుగురు పిల్లలు ఉన్నారు. విపత్తు సహాయ నిధి నుంచి నాలుగు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ఎస్‌డిఎం అనురాగ్ సింగ్ తెలిపాడు.

Also Read: మహిళా డ్రైవర్‌కు ఉద్వాసన..కారు కొనిచ్చిన కమల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News