Wednesday, January 22, 2025

పత్తి చేనులో కనిపించిన మొసలి… భయంతో వణికిపోయిన కూలీలు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవరచెరువులో పత్తి చేనులో మొసలి కనిపించిన సంఘటన కలకలం రేపింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం చాకలి కందనమ్మ పత్తి చేనులో కూలీలు పని చేస్తుండగా మొసలి కనిపించడంతో వారి గుండె ఆగినంత పనైంది. భయభ్రాంతులకు గురైన కూలీలు వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మొసలి అక్కడ ఉన్న బావిలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన హెడ్ కానిస్టేబుల్  పురేందర్, కానిస్టేబుల్ నిరంజన్, అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండవచ్చని  అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News