Sunday, December 22, 2024

ఒడిశాలో 10 ఏళ్ల బాలుడిని చంపిన మొసలి

- Advertisement -
- Advertisement -

కేంద్రపర: ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో ఒక 10 ఏళ్ల బాలుడిని మొసలి చంపివేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
5వ తరగతి చదువుతున్న అశుతోష్ ఆచార్య అనే బాలుడు నిమాపూర్ గ్రామం వద్ద బ్రహ్మణి నదిలో స్నానం చేస్తుండగా మొసలి అతనిపై దూకి చంపివేసింది.

భితర్‌కనిక నేషనల్ పార్కు శివార్లలో ఈ నది ప్రవహిస్తుంది. ఆ బాలుడి కోసం గ్రామస్తులు గాలించగా కొద్ది గంటల తర్వాత సగం తినేసిన మృతదేహం కనిపించించినట్లు పోలీసులు చెప్పారు. పట్టముండై పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది. బాలుడి కుటుంబానికి రూ. 6 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం అందచేస్తుందని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News