Monday, December 23, 2024

కాలువలో ముఖం కడుగుతుండగా యువకుడిని చంపిన మొసలి

- Advertisement -
- Advertisement -

గుజరాత్: యువకుడు కాలువులోకి దిగి ముఖం కడుగుతుండగా మొసలి అతడి లాక్కెళ్లి చంపిన సంఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సరార్ గ్రామంలో దిలీప్ పార్మర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. గ్రామ శివారులో ఉన్న కాలువులోకి దిగి ముఖం కడుగుతున్నప్పుడు అతడికి సమీపంలో మొసలి ఉన్న విషయం గుర్తించలేదు. వెంటనే అతడి పాదాన్ని మొసలి నోట కరుచుకుని నీటిలోకి లాక్కెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న రైతులు కాపాడడానికి ప్రయత్నించారు. అతడిని మొసలి లోపలికి తీసుకెళ్లింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని కాలువలోని నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News