మంగళవారం రాతి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి అపార నష్టం వాటిల్లింది. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులు రావడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడగా వరి మొక్కజొన్న పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. భారీ వృక్షాలు రోడ్లపై పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్‌ను నిలిపివేసి మరమ్మతులను చేపట్టారు. మరికొద్ది రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో ఈదురు గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత కొన్నేళ్లుగా పంట చేతికి వచ్చే సమయానికి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు తీవ్రంగా నష్టాల్లో మునుగుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
అకాల వర్షంతో అపార నష్టం
- Advertisement -
- Advertisement -
- Advertisement -