మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించుకునేందుకు ప్రత్యేక యాప్‌కు రూపకల్పన చేశారు. ప్రోఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరబాద్ ఐఐఐటి సంయుక్తంగా పరిశోధనలు జరిపి ఈయాప్‌ను రూపోందించాయి. పంటల సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు రైతులే స్వయంగా తెలుసుకునేందుకు ఈ యాప్ ద్వారా అవకాశం కలిగిందని ఐఐఐటి ఫ్రోఫెసర్ పి.కృష్ణారెడ్డి తెలిపారు. వివిధ రకాల పంటల్లో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో సులువుగా తెలిసిపోతుందన్నారు. పంటల్లో ఉన్న సమస్యలను తొలగించుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా యాప్ ద్వారానే పొందవచ్చని తెలిపారు. స్మార్ట్ ఫోన్‌తో పంటను సందర్శించి సమస్యలు, వాటి లక్షణాలని సంబంధిత ప్రశ్నలను జాగ్రత్తగా చదవి, సమస్య లక్షణం ఆధారంగా వాటికి పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. క్రాప్ దర్పణ్ యాప్ ద్వారా రైతులు వివిధ రకాల పంటల్లో సమస్యలను పరిష్కరించుకుంటూ వేగవంతమైన సేవలు పొందవచ్చని ప్రో.కృష్ణారెడ్డి పేర్కొన్నారు.