Thursday, January 9, 2025

నీట మునిగిన పంట పొలాలు

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: వర్షాకాలం వచ్చిందంటే చాలు మంథని మండలంలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత సంవత్సరం వరదల తీవ్రత అధిక కావడంతో మంథని గ్రామానికి మూడు నాలుగు రోజులపాటు రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సోమవారం రాత్రి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి మంథని పాత పెట్రోల్ బంక్ ఏరియాలో గల పంట పొలాలు పూర్తిగా నీటిమునిగాయి.

వర్షం నీటితోపాటు చెరువుల అలుగు నీరు కుడా ఎత్తి పాడుతుండటంతో గంగాపురి సూరయ్య పల్లె, ఎక్లాస్పూర్ తదితర గ్రామాల్లోని పంట పొలాలు జలదిగ్భంధమయ్యాయి. ఇంకా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజల్లో భయాందోళనలు అధికమవుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మంథని గోదావరి నది తీరంలో నీటి ప్రవాహం అభద్రతాభావం పెరుగుతుంది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో వేగంగా నీటి ప్రవాహం కాలేశ్వరం ప్రాజెక్టు వైపు వెళ్తోంది. గోదావరి నదిలో నీటి మట్టం పెరుగుతుందని తెలియడంతో మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో గోదావరి నదిని తిలకించడానికి వస్తున్నారు. ప్రజలు గోదావరి నది వద్దకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News