- Advertisement -
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ఇప్పటివరకు 25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, కరోనా కారణంగా నిలిచిపోయిన రుణమాఫీని కొనసాగిస్తూ 50 వేల వరకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. అందుకు అగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రుణ మాఫీ ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది. తద్వారా 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు. 25 వేల రుణమాఫీతో ఇప్పటికే 3 లక్షల పై చిలుకు రైతులు ప్రయోజనం పొందారు.దీంతో ఇప్పటివరకు రుణమాఫీ ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 9 లక్షలకు చేరనున్నది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కూడా దశలవారీగా కొనసాగుతుందని కేబినెట్ నిర్ణయించింది.
- Advertisement -