Wednesday, July 3, 2024

రుణమాఫీకి ఢోకాలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్ : ఆర్థిక అవసరాలు ఎన్ని ఉన్నా, ఇ ప్పటికే ఖజానాపై భారం తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా అప్పులు చేసే విష యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచీతూచీ అడుగులేస్తోంది. రాష్ట్ర ప్ర జలకిచ్చిన హామీలను నెరవేర్చేక్రమంలో రైతులకు పంట రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆర్థి క శాఖ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఆగస్టు 15వ తేదీ నాటికే పంట రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అప్పటికి నిధులను సమకూర్చు కోవాలని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్ధికశాఖాధికారు లను ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జూలై నె లాఖరుకే నిధులు సమకూరే విధంగా ఆర్థిక శాఖాధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. పంట రుణాల మాఫీకి అవసరమైన 31 వేల కోట్ల రూపాయల నిధులను జూలై నెలాఖరుకల్లా ఖజానా లో ఉం డేటట్లుగా ఏర్పాట్లు చేసినట్లుగా కొందరు సీనియర్ అధికారులు వి వరించారు.

సెక్యూరిటీ బాండ్ల వేలంలో గత ఏప్రిల్ నెల నుంచి జూన్ నెలాఖరు వరకూ రిజర్వు బ్యాంకు నుంచి 16 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, అందులో నుంచి సుమారు 10 వేల కోట్ల రూపా యల నిధులను పంట రుణాల మాఫీ కోసం రిజర్వు చేసిఉంచామని, దానికితోడు రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చే సొంత ఆదాయం లో నుంచి వచ్చే నిధులు, జూలై నెలలో సెక్యూరిటీ బాండ్ల వేలం నుం చి మరో ఏడు వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయని, ఆగస్టు నెలలో మొదటి రెండు వారాల్లో కలిపి మరో రెండు వేల కోట్ల రూ పాయల నిధులు ఆర్‌బిఐ నుంచి వస్తాయని, ఇలా అన్ని వైపుల నుం చి నిధుల సమీకరణ ప్రక్రియను పక్కా ప్రణాళికతో చేపట్టామని, అం దుకే పంట రుణాల మాఫీకి ఎలాంటి ఢోకా లేకుండా ముఖ్యమంత్రి నిర్దేశించుకొన్న షెడ్యూలు ప్రకారమే రుణాల మాఫీ జరుగుతుందని ఆర్ధికశాఖలోని అధికారులు వివరించారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకూ రెండో త్రైమాసికంలో సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి మరో 16 వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకోవడానికి రాష్ట్ర ప్ర భుత్వం ఇండెంట్ పెట్టగా అందుకు ఆర్‌బిఐ కూడా ఆమోదముద్ర వేసిందని తెలిపారు. మొదటి త్రైమాసికంలోని

ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొన్ని పథకాలకు నిధులను ఖర్చు చేయకుండా నిలిపివేయాల్సి వచ్చిందని, దానికితోడు బిల్లుల చెల్లింపులను కూడా వాయిదా వేయడం జరిగిందని వివరించారు. జిఎస్‌టి పన్నుల ఆదా మద్యం అమ్మకాలతో వచ్చిన ఎక్సైజ్ ఆదాయం, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల విభాగం, అటవీశాఖ, రవాణా శాఖ, గనుల శాఖ తదితర ఆదాయాన్ని స మకూర్చే విభాగాల నుంచి కూడా ఖజానాకు మెరుగైన ఆదాయమే వచ్చిం దని, అందుచేతనే భారీగా అప్పులు చేయాలనే ఆలోచనకు ఫుల్‌స్టాప్ పెట్టి ఎఫ్‌ఆర్‌బిఎం చట్ట ప్రకారమే రుణాల సేకరణకు పరిమితం కావాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి (ఆర్ధికశాఖామంత్రి) భట్టి విక్ర మార్కలు ఒకేమాటగా చెప్పడంతోనే పెద్ద మొత్తాల్లో అప్పులు చేయడం లేదని ఆ అధికారులు వివరించారు. వాస్తవానికి బిజెపి పాలిత రాష్ట్రాల్లో మె జారిటీ రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని దాటిపోయి ఆయా రాష్ట్రాల జిఎస్ డిపిలో 30 శాతం నుంచి 46 శాతం వరకూ అప్పులు చేశాయని,

కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కేవలం 27.8 శాతానికి పరిమితం అయ్యాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపూర్వం ఈ అప్పులు 28 శాతం ఉండేవని, ఇప్పుడు ఆ అప్పులు 27.8 శాతానికి తగ్గా యని ఆ అధికారులు వివరించారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 0.2 శాతం అప్పులు తగ్గాయని తెలిపారు. ఇలా పక్కా ప్రణాళికతో ఆర్ధిక వ్యవస్థ ముందుకు సాగుతోందని వివరించారు. రాష్ట్ర ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నుల భారాన్ని మోపకుండా, ఆర్ధిక క్రమ శిక్షణను పాటిస్తూ, దుబారా వ్యయాన్ని నియంత్రిస్తూ, హంగులు-ఆర్భాటా లకు పోకుండా, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకుండా, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆర్ధిక వ్యూహంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఆర్ధికశాఖ వర్గాలు సగర్వంగా చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News