Thursday, December 26, 2024

డిసెంబర్ 9లోపు రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/రామన్నపేట : రైతుల సమస్యలను తీర్చడానికి తమ ప్రభుత్వ కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో రూ.3.5 కో ట్లతో నిర్మించిన నూతన భవనాన్ని శనివారం నకిరేకల్ ఎంఎల్‌ఎ వేముల వీరేశంతో కలిసి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ..ప్రతి రైతు సమస్యలనుప్రభు త్వం పరిష్కరిస్తుందని అన్నారు. 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, మిగిలిన వారికి డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వ పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. వడ్ల కొనుగోలు విషయంలో మిల్లర్లతో సిఎం సమావేశం నిర్వహించారని, రైతులు పండించే పంటకు ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయలతో పంటల బీమా ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఎన్నికష్టాలు వచ్చినా రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అన్నారు.

నేతన్నల రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్రిఫ్డ్ కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. చేనేతల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి పెండింగ్ నిధులను సత్వరం మంజూరు చేస్తామని అన్నారు. రద్దయిన ఆప్కోను పునరుద్ధరించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేనేత సంఘాలలో పేరుకుపోయిన వస్త్రాలను వెంటనే కొనుగోలు చేయాలని జౌళి శాఖ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. గత ప్రభుత్వంలో కేంద్రం నుండి వచ్చే వివిధ పథకాలను అమలు చేయకపోవడంతో సహకార సంఘాలు కోట్లాది రూపాయలు నష్టపోయాయన్నారు. చేనేత ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డకు నాణ్యమైన స్త్రీ శక్తి చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. సొంత నిధులతో నూతన హంగులతో పిఏసిఎస్ భవనం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. భవనానికి అవసరమైన సిసిరోడ్డు , గోదాం తదితర సౌకర్యాల ఏర్పాటుకు ఎంఎల్‌ఎ నిధుల ద్వారా వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డిసిఎంఎస్ ఛైర్మన్ బోళ్ల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News