Monday, January 20, 2025

పంటరుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
తెలంగాణ రైతు సంఘం

హైదరాబాద్: వ్యవసాయరంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పంట రుణాల మాఫీని సమగ్రంగా అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర విజ్ణప్తి చేసింది. శనివాంర సంగం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడారు. సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఈ నెల 14నుంచి 16 వరకూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట పట్టణంలో విజయవంతంగా జరిగాయని తెలిపారు. చివరి రోజు జరిగిన విస్తృత రాష్ట్ర స్థాయి సమావేశంలో దేశ, రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులపై చర్చించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కార్యచరణ రూపొందించడం జరిగిందన్నారు.

రైతుల లక్షలోపు రుణాలను మాఫీ చేస్తానని 2018 ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నాలుగున్నార సంవత్సరాలు గడుస్తున్న రుణాలన్ని పూర్తిగా మాఫీ కాలేదని తెలిపారు. గతంలో 25లోపు ఒక సారి, 50 వేల లోపు మరో సారి మాఫీ చేస్తామని అన్నారని ,ఆచరణలో రూ. 7 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. రూ. 35 వేలలోపు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని, ఫలితంగా రైతాంగానికి కొత్త అప్పు బ్యాంకుల నుండి రావటం లేదని తెలిపారు.. దీని వలన ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు తేచ్చి వ్యవసాయ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ తరువాత లక్ష లోపు అప్పు ఉన్న రైతులకు రూ.50 వేలు అధనపు వడ్డీ పడిందని అన్నారు. ఈ అంశంపై ఈ నెల 19 నుండి రాష్ట్ర వ్యాపితంగా తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అటవీ హక్కుల చట్టం ప్రకారం రాష్ట్రంలో 11.6 లక్షల ఎకరాల సాగు చేస్తున్న పోడు రైతులకు హాక్కు పత్రాలను ఇవ్వాలన్నారు. 4 లక్షల ఎకరాలకే హక్కు పత్రాలే ఇస్తామన్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసి అర్హులైన అందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర అటవీ సంరక్షణ సవరణలు తెచ్చేందుకు పాలకులు పూనుకుంటున్నారని , ఆదివాసులను అడవుల నుండి గెంటివేయడానికే ఈ సవరణలు చేస్తున్నారన్నారు. వీటికి వ్యతిరేకంగా జూన్ 30న దేశ వ్యాపితంగా జరిగే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేయాలని కొంత మంది అంటూన్నారని , ఇది సరికాదన్నారు. ఈ పథకంలో ఉన్న లోపాలను సవరించి, పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు , సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News