Monday, December 23, 2024

రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

 కల్వకుర్తి : అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ. పది వేల పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు నరసింహ, సీనియర్ నాయకుడు దుర్గా ప్రసాద్, జిల్లా బిసి మోర్చా ప్రధాన కార్యదర్శి రవి గౌడ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం లేదని, వరి ధాన్యం డబ్బులు ఇంకా చాలా మంది రైతులకు రాలేదని, ఫసల్ బీమాను అమలు చేయడంలోరాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విపత్తులో రైతులకు ఎంతో లాభం జరుగుతుందన్నారు.

రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి సంవత్సరాలు గడుస్తున్న ఆ ఊసే లేదని, గతంలో ఖరీఫ్ సీజన్‌లో రాయితీ విత్తనాలు, ఎరువులు, పనిముట్లు అందించే వారని ఇప్పుడు అవేవి కూడా లేవని అన్నారు. నకిలీ విత్తనాలు జోరుగా విక్రయాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి పట్టణ ఉపాధ్యక్షుడు బాబి దేవ్, లక్ష్మినరసింహ, సాయి కిరణ్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News