Monday, December 23, 2024

పంట నష్టం అంచనాకు సిఎం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి.. కరీంనగర్ గ్రామీణ మండలం సహా.. రాష్ట్రంలో అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం అంచనాకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి దెబ్బతిన్న పంటలకు సంబంధించిన

వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సిఎం సూచించారు.అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతికుమారికి సిఎం ఆదేశాలు జారీ చేశారు.గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కురిసిన వడగళ్ల వానకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సిఎం కెసిఆర్ పంట నష్టాన్ని అంచనా వేయాలని సిఎస్‌ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News