Sunday, January 19, 2025

11లక్షల ఎకరాల్లో పంట నష్టం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అతివృ ష్టి వానాకాల రైతుల ఆశలను మొలక దశలోనే చిదిమేసింది. భారీవర్షాలు వరదలు పంటపోలాల్లో లేతపైర్లనునీటమంచేత్తాయి. రోజుల తరబడి వరదనీరు పొలాల్లో నిల్వ ఉండడంతో పలు రకాల పైర్లు మొలక దశలోనే కుళ్లిపోయాయి. వ్య వసాయ వర్గాల ప్రాథమిక నివేదికలను బట్టి రా ష్ట్రంలో సాగు చేసిన వానాకాల పంటలకు సబంధించి సుమారు 11లక్షల ఎకరాల్లో పైర్లకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఈ నష్టం ఇం కా అధికంగానే ఉంటుందని రైతు సంఘాలు అం చనా వేస్తున్నాయి. అందులో అత్యధికంగా పత్తిపైరుకు నష్టం జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నే అధికంగా పైర్లకు నష్టం జరిగింది. రాష్ట్రంలోని 33జిల్లాల్లోనూ అధికశాతం వర్షపాతం నమోదైం ది. జులై నెల జరిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా పైర్లకు నష్టం జరిగింది. రాష్ట్రంలోని 33జిల్లాల్లోనూ అధికశాతం వర్షపాతం నమోదైంది. జులై నెల సాధారణ వర్షపాతం 244మి.మి కాగా, 525మి.మి వర్షపాతం నమోదైంది. సగటున 149శాతం అధికంగా వర్షం కురిసింది. పంటపొలాల్లో రోజుల తరబడి నీరు నిలిచిపోయింది. రాష్ట్రంలో వానాకాల సీజన్‌కు సంబంధించి అన్ని రకాల పంటలు కలిపి ఇప్పటివరకూ 71.78లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అందులో అత్యధికంగా 44.53లక్షల ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చింది.అదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల,ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలకు పైర్లు నీటమునిగాయి. వేలాది ఎకరాల్లో పైర్లు కుళ్లిపోయినట్టు సమాచారం.

అంతే కాకుండా గోదావరి నది పరివాహకంగా ఉన్న లోతట్టు ప్రాంతాల్లో వరిపైర్లకు జరిగిన నష్టం మరింతగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పంట పొలాల్లో ఇంకా వరదనీరు తొలగిపోలేదు. నిలువ నీరంతా పూర్తిగా తొలిగిపోయాక పైర్లు ఏమేరకు పనికి వస్తాయన్నది అంచనావేయలేమంటున్నారు. పత్తితోపాటువర్షాధారంగా వేసిన పెసర, మినుము తదితర పప్పు ధాన్య పైర్లు కూడా దెబ్బతిన్నాయి. రోజలు తరబడి మొక్కలు నీటమునిగివుండటంతో పైర్లు బురద మట్టితో పేరుకుపోయాయి. అంతే కాకుండా పోలంలో తేమ ఆరిపోయే పరిస్థితిలేక నేల జోమెక్కి లేతపైర్ల వేర్లు భూమిలోనే కుళ్లిపోయినట్టు రైతులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో లేత కంది పైర్లు కూడా దెబ్బతిన్నట్టు సమాచారం .

ఇసుక మేటల్లో పంటపొలాలు:

భారీ వరదల ధాటికి పంటపొలాలు కొన్ని చోట్ల నామరూపాల్లేకుండా మారిపోయియి.వరద ఉధృతికి పైర్లు వేర్లతో సహా లేచిపోయాయి. పొలంలో సారవంతమైన మట్టి వరదప్రవాహంలో కొట్టుకు పోయింది. వాగులు ,వంకలతోపాటు నదీపరివాహకంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పైర్ల స్థానంలో రాళ్లు రప్పలు తేలిఉన్నాయి. పొలంలో ఇసుక మేటలు చూసి రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పైర్లు కుళిపోయినా చెడగొట్టి మళ్లీ విత్తనాలు వేసుకోవచ్చని, ఇసుక మేటలు తొలగించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు తలకు మించిన భారమవుతుందని రైతులు వాపోతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలే శరణ్యం:

వరద ముంపునకు గురైన పొలాల్లో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందిస్తున్నారు. పొలంలో వరద నీరు పూర్తిగా తొలగించి ఉన్న పైర్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని రైతులకు సూచిస్తున్నారు. పైర్లు పూర్తిగా పాడైన చోట ఇక పనికిరాని దశలో ఉంటే ఆ పైర్లను పూర్తిగా తొలగించి వాటి స్ధానంలో ఇతర పంటలను సూచిస్తున్నారు. పత్తి పైర్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఉన్న పైరును తొలగించి తిరిగి పత్తి నాటుకునేందుకు అవకాశం లేదు. పత్తిసాగుకు ఈ నెల రెండవ వారంతోనే అదను కాలం ముగిసిపోయింది. పత్తి తిరిగి నాటినా దిగుబడి ఆశించిన రీతిలో లభించే అవకాశాలు ఉండవని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తికి బదులుగా ఇతర ప్రత్యామన్నాయ పంటలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

పంటనష్టాలపై త్వరలో పూర్తి నివేదిక:

అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏమేరకు పంటులకు నష్ట వాటిల్లిందన్నది ఇంకా పూర్తి వివరాలు అందాల్సివుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాలో నిలువ నీరు పూర్తిగా తొలగిపోయాకే పైర్లకు జరిగిన నష్టం అంచనా వేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు. త్వరలోనే వానాకాల పంటనష్టాలపై సమగ్ర నివేదిక సిద్ద చేయనున్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News