Thursday, December 19, 2024

నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెట్టుబడి వరదపాటు కావడంతో రైతులు రోదిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్‌కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. అకా వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు. వేలాది ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం జరిగిందని, టమాట, ఉల్లి, మిర్చి రైతులూ తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

పంట నష్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల సాగు ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. గతంలో పంట నష్టం జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర బృందాలు పర్యటించి పంట నష్టం అంచనా వేసి నిధులు మంజూరు చేసేవని, ప్రస్తుతం తెలంగాణలో పంటల బీమా పథకం లేకుండా చేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పంట నష్టాలను అంచనా వేసి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని రైతుల తరపున కోరారు. తెలంగాణలో పంటల బీమా పథకం తక్షణమే అమలు చేయాలని అడిగారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News