Monday, December 23, 2024

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పంటనష్టం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఖానాపురం/నల్లబెల్లి: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించిన ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఖానాపురం మండలం ధర్మారావుపేట రైతు వేదికలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా మార్చి 2023లో పంటలు నష్టపోయిన 901 మంది రైతులకు 809 ఎకరాలకు గాను రూ. 80.90 లక్షల మొత్తాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్టపరిహారం సీఎం కేసీఆర్ రైతాంగానికి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర మొత్తంలో ఇక్కడ అమలుపరిచిన పథకం నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రూ. 37.5 కోట్ల సబ్సిడీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఖానాపురం మండలానికి రూ. 6 కోట్ల సబ్సిడీ మొత్తం కేటాయించామన్నారు.

ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ ఛైర్మన్ గుగులోతు రామస్వామినాయక్, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్‌రావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకనర్సయ్య, నల్లబెల్లి పీఏసీఎస్ ఛైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్‌ఎస్ నల్లబెల్లి మండల కన్వీనర్ కన్వీనర్ ఊడ్గుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్, సర్పంచులు చింతపట్ల సురేష్, తిరుపతి, శ్రీదేవి, రాజు, వెంకన్న, ఎంపీటీసీలు, ఏడీఏ శ్రీనివాస్‌రావు, ఏఓ పరమేశ్వర్, ఏఈఓలు, సర్పంచ్, మండల వ్యవసాయాధికారి, ఏఈఓలు, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్, భగత్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సభ్యులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News