హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగి పంటల సాగు సీజన్‌కు సంబంధించి ఈ నెల 20లోపు పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిం ది. పంటల నమోదు ప్రక్రియలో క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్షం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. క్లష్టర్ల వారీగా గ్రామాల్లో ఎన్ని రకాల పంటలు సాగు చేశారు. రైతు పేరు , ఆధార్ కార్డు , సెల్‌పోన్ నెంబరు, సాగు చేసిన పంటల్లో ఎంపిక చేసుకున్న రకాలు, సర్వేనెంబర్ల వారీగా పంట సాగు విస్తీర్ణం తదితర అంశాలు నమోదు వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
పంటల నమోదు ప్రకియను పూర్తి చేసి ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రదర్శనకు ఉంచాలని తెలిపింది. పంటల నమోదు ప్రక్రియను ఆన్‌లైన్‌లో పొందు పరచటం ద్వారా గ్రామ, మండల , జిల్లా ,రాష్ట్ర స్థాయిలో ఏ రకం పంట ఎంత విస్తీర్ణంలో సాగు జరిగింది. పంటలకు అవసరమైన మార్కెటింగ్ సదుపాయాలు ఏవిధంగా కల్పించాలి అన్నదానిపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు సులభతరం అవుంతుందని అధికారులు వెల్లడించారు.