Thursday, January 16, 2025

వాతావరణ మార్పులకు తగ్గట్టుగా పంటల సరళికి సంయుక్త కృషి

- Advertisement -
- Advertisement -

అగ్రి వర్శిటికి ఎన్‌ఐఆర్‌డి మధ్య ఎంఓయూ
వానాకాల సాగునాటికి ప్రణాళిక సిద్దం

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ మార్పులకు తగ్గ పంటల సరళి దిశగా గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య పరిచేందుకు ఉమ్మడి కృషిని చేపట్టనున్నట్టు జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ వెల్లడించారు. ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ మధ్యన శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా డా.సుధీర్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడం శుభపరిణామం అన్నారు.

తాము ఇప్పటికే అనేక ఐసిఏఆర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని గ్రామీణాభివృద్ది ,గ్రామీణుల అభ్యున్నతి కోసం కలిసి పనిచేస్తున్నామని వివరించారు. పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది ,వ్యవసాయశాఖలు సంయుక్తంగా పనిచేస్తే ఆశించిన లక్ష్యాలను వేంగంగా చేరుకోగలమన్నారు. వాతావరణ మార్పుల నేపధ్యంలో మారతున్న పంటల సరళి , వాటర్ షెడ్‌లు తదితర అంశాలపై రెండు సంస్థలూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.ప్రవీణ్ రావు మాట్లాడుతూ రెండు సంస్థల మధ్య అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. వచ్చే వానాకాలం పంటల సాగు నాటికి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసిన అవసరం ఉందన్నారు.

వర్శిటీ ఏర్పాటైన నాటి నుంచి తెలంగాణ సాగు పరిస్థితుల్ని పరిపుష్టం చేయడానికి వర్శిటి అనేక విధాలుగా కృషి చేస్తోందని వివరించారు. వర్శిటి రూపొందించిన వంగడాలు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆరేడు రాష్ట్రాల్లో ఆదరణ పొందాయన్నారు. సహజ వనరుల యాజమాన్యం అనేది నేడు ప్రధానాంశమన్నారు. బిగ్‌డేటా ,డ్రోన్లు వంటి అనేక నూతన టెక్నాలజీలు నేడు అందుబాటులోకి వస్తున్నాయని, వ్యవసాయరంగం డిజిటలీకరణ వైపు సాగుతోందని వెల్లడించారు. ఈ అధునాతన టెక్నాలజీల సాయంతో రైతులకు పెట్టుబడి వ్యయాలను , నష్ట భయాలను తగ్గించి ,ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని ప్రవీణ్ రావు పర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్శిటి రిజిస్ట్రార్ డా.ఎస్ . సుదీర్ కుమార్‌తోపాటు పలువురు ఎన్‌ఐఆర్‌డి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News