Wednesday, January 22, 2025

వదలని‘వడగండ్ల’వాన..భారీగా పంట నష్టం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: వడగండ్ల వాన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను వదలడం లేదు. మూడు రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో కురిసిన వడగండ్ల వాన రైతన్నలను నిండాముంచింది. గురువారం మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ప్రారంబమైన వడగండ్ల వాన అనంతరం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు విస్తరించింది. రంగారెడ్డి జిల్లాలో వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 5 మి.మి సాదారణ వర్షపాతం కుర వవలసి ఉండగా ఇప్పటికే .జిల్లాలో 30 మి.మిలకు పైగా వర్షపాతం నమోదైంది.

జిల్లాలోని మొయినాబాద్‌లో 20.1 మి.మి, చెవెళ్లలో 15.7, కేశంపేట్‌లో 16.2 మి.మి, రాజేంద్రనగర్‌లో 14.8 మి.మి, శంకర్‌పల్లిలో 11.4 మి.మి, శేరిలింగంపల్లిలో 7 మి.మి, కడ్తాల్‌లో 9 మి.మి, షాబాద్‌లో 13.3 మి.మి, కొందూర్గులో 7.1, కొత్తూర్‌లో 3 మి.మి, ఫరూక్‌నగర్‌లో 6.9 మి.మి, వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌లో జిల్లాలో మర్పల్లిలో 36 మి.మి, మోమిన్‌పేట్‌లో 21మి.మి, నవాబ్‌పేట్‌లో 28.6 మి.మి, వికారాబాద్‌లో 21.7 మి.మి, కుల్కచర్లలో 17.3 మి.మి, దోమలో 12.9 మి.మి, బొంరాసిపేట్‌లో 19 మి.మి, కోట్‌పల్లిలో 10మి.మి, బంట్వారంలో 16.4 మి.మి, తాండూర్‌లో 16.8 మి.మి, పెద్దెముల్‌లో 18.7 మి.మి, కొడంగల్‌లో 16.7 మి.మి, దౌల్తాబాద్‌లో 17.5 మి.మి వర్షపాతం నమోదైంది.
భారీగా పంట నష్టం
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు మండలాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిన అధికారులు మాత్రం క్షేత్రస్థాయి పర్యటలనకు దూరంగా ఉంటు కాకి లెక్కలు రాసుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. మర్పల్లి మండలంలో మంత్రులు సబితారెడ్డి, నిరంజన్ రెడ్డి ల పర్యటనలో కనిపించిన అధికారులు మిగత మండలాల్లో పంట నష్టం అంచనాలు వేయడంలో మాత్రం శ్రద్ద చూపడం లేదని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజా ప్రతినిధులు వస్తేనే అధికారులు వచ్చి నష్టపరిహరం అంచనాలు వేసే అవకాశం ఉండటంతో కనీసం ఎమ్మెల్యేలు అయిన తమ గ్రామాల్లో పర్యటించాలని రైతులు కొరుతున్నారు.

మర్పల్లి తదితర మండలాల్లో పెద్ద ఎత్తున నష్టం చోటు చేసుకుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంట నష్టం తో పాటు ఆస్తి నష్టం సైతం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరాకు గంటల తరబడి అంతరాయం కలుగుతుండటంతో జనం ఆవస్థలు పడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై సమగ్ర నివేదికలను తయారు చేసి తమను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News