Wednesday, January 22, 2025

పంటకు ప్రమాద ఘంటిక

- Advertisement -
- Advertisement -

కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు వ్యవసాయరంగం చివికి పోయింది. పొలాలపైకి పరుగులెత్తిన వరద నీటిలో రైతు కష్టం కోట్టుకుపోయింది. వివిధ జిల్లాల నుంచి అందుతున్న స మాచారం మేరకు ఇప్పటికే సుమారు 10లక్షల ఎ కరాలకు పంటనష్టం వాటిల్లింది. ఇంకా వాగులు వంకలు, నదుల పరీవాహకంగా లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో లేతపైర్లు నిలువ నీటిలో కు ల్లిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో పైర్లను బురద కమ్మేసింది. పొలమంతా బురద ముసుగు వేసినట్టుగా పైర్లు తలవాల్చేశాయి. వాగులు వంకలకు సమీపాన ఉన్న పొలాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. మరో వైపు వరద నీటి ఉధృతికి నిజామాబా ద్ , పెద్దపల్లి, అదిలాబాద్, ములుగు ,ఖమ్మం , భ ద్రాద్రికొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో పైర్లు వేర్లతో సహా కొట్టుకుపోయా యి.

చాలా చోట్ల నేల కోతకు గురైన ప్రాంతాల్లో రాళ్లు తేలాయి. మేటలు వేసింది. ఇక ఆ పొ లం పంటల సాగుకు ఇప్పటికిప్పుడు ఎంత మా త్రం పనికి వచ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పొలంలో నేల పైపొర రెండు అంగులాకు పైగా కొసుకుపోయింది. సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోవటంతో రైతులు ఆ వేదన చెందుతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 50వేల ఎకరాలకు పైగా పొలా ల్లో నేల కొతకు గురైనట్టు తెలుస్తోంది. అదిలాబా ద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ , మంచిర్యా ల , తదితర జిల్లాల్లో పత్తి పైరు భారీగా దెబ్బతింది. అప్పటికే విత్తనం వేసి ఎదుగుతున్న లేతపైర్లకు రైతులు రసాయనిక ఎరువులు కూడా వేశారు. నెలరోజులు పైగా ఉన్న లేత పత్తి పైర్లు భారీ వర్షాలు , వరదల ధాటికి భారీగా దెబ్బతిన్నాయి.

ఎడతెరిపి లేకండా ముసురు పట్టి కురిసిన వర్షాలకు పత్తిపైరు పచ్చదనం కొల్పోయి అకులు ఎర్రబారి రంగు మారాయి. రాష్ట్రంలో ఈ సీజన్ కింద మేనెల చివరి వారం నుంచి ఇప్పటికే 40.73 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం వేశారు. ఇంకా మరో 10లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి విత్తనాలు వేయాల్సివుంది. గత వారం రోజులుగా వర్షాలు లేకుండా ఉంటే ఈ పాటికి రాష్ట్రంలో పత్తి విత్తనాలు వేయటం పూర్తయి పత్తి సాగు 50.59లక్షల ఎకరాల సాధారన సాగు విస్తీర్ణతకు చేరుకుని వుండేది. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇక పత్తిసాగుకు అదను ముగిసి పోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తి విత్తనం సాధారణ సాగు విస్తీర్ణం చేరటం అటుంచి ఇప్పటికే విత్తనం పడ్డ పొలాల్లో పైర్లు బతికి బట్టకట్టే పరిస్థితి లేకపోవటం రైతులను ఆందోళన గొలుపుతోంది. వ్యవసాయశాఖ అధికారుల ప్రాధామిక సమాచారం మేరకు రాష్ట్రంలో అధిక వర్షాలు వరదల వల్ల 4లక్షల ఎకరాల్లో పత్తి పైర్లు దెబ్బతిన్నట్టు వెల్లడించారు. అయితే ఈ నష్టం ఇంతకు రెట్టింపే ఉంటుందని తెలుస్తోంది.

పాచిపోయిన పప్పుధాన్య పంటలు !
రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల పప్పుధాన్య పంటలు పలు ప్రాంతాల్లో పాచిపోయాయి . కంది , పెసర ,మినుము, తదితర పప్పుధాన్య పంటలు ఈ సీజన్‌లో 4.39లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి . ఇంకా విత్తనాలు వేసుకునేందుకు గడువు ఉండడంలో రైతులు తెరిపి ఇస్తే పొలాల్లో విత్తనం వేసుకునేందుకు సిద్ధ్దంగా ఉన్నారు. ఈ పరిస్థిల్లో భారీ వర్షాలు పప్పుధాన్య పంటలను దెబ్బతీశాయి. వ్యవసాయ శాఖ అంచానాల మేరకే సుమారు 22వేల ఎకరాల్లో కంది పంటకు నష్టం వాటిల్లింది. కందితోపాటు పెసర, మినుము పైర్లు సుమారు 50వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్టు సమాచారం. చాలా జిల్లాల్లో వర్షాధారంగా సాగు చేసిన పప్పుధాన్య పంటలు అధిక వర్షాల కారణంగా వేరుకుళ్లుతో ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.

దెబ్బతిన్న నూనెగింజ పైర్లు
భారీ వర్షాలు నూనెగింజ పైర్లను కూడా దెబ్బతీశాయి. వేరుశనగ వేరుకుళ్లుతో దెబ్బతింది. పైర్లలో బురదనీరు ఆకులకు పట్టేసింది. ఇప్పటికే 10వేల ఎకరాల్లో వేరుశనగ పైర్లకు నష్టం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో 5.19లక్షల ఎకరాల్లో నూనెగింజ పైర్లు సాగులోకి రావాల్సివుండగా , వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, సోయాబీన్ తదితర పైర్లు 4.19లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. అయితే ఇందులో ఎంత విస్తీర్ణం మేరకు పైర్లు దెబ్బతిన్నాయన్నది వర్షం పూర్తిగా వెలిస్తేగాని అంచనా వేయలేమని అధికారులు తెలిపారు. వీటితోపాటు సుమారు 12వేల ఎకరాల్లో కూరగాయలు ఆకు కూరల పైర్లు కూడా దెబ్బతిన్నాయి.

వరిపైర్లు కోలుకుంటాయా!
అప్పుడప్పుడే నాట్లు వేసిన వరి పైర్లు కుచ్చులతో సహా వరదనీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నెల రెండవ వారం వరకూ వరి నాట్లు వేసిన పైర్లు కొంత నిలదొక్కుకోగలిగాయి. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసిన వరిపైర్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే 15.63లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో 49.86లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సివుంది. ఇప్పటివరకూ 31.36శాతం మేరకు వరినాట్లు పడ్డాయి. చాలచోట్ల అధిక వర్షాలకు వరి నారుమళ్లు దెబ్బతిన్నాయి. పది రోజుల ముందుగా వరినాట్లు పడ్డ పైర్లు వరదనీటిల మునిగి బురదకోట్టుకున్నాయి. అయినప్పటికీ ఈ పైర్లు తిరిగి కోలుకుంటాయని అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు ధైర్యం చెబుతున్నారు . రాష్ట్రంలో ఈ ఖరీఫ్ కింద ఇప్పటివరకూ అన్ని రకాల పంటలు కలిపి 68.80లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. సాధారణ సాగు విస్తీర్ణంలో ఇది 55.36శాతానికి చేరుకుంది. వర్షంతెరిపి ఇవ్వగానే వ్యవసాయ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి గ్రామాలకు పంపి పంట నష్టం అంచానాలు వేసేందుకు సిద్దమవుతున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News