రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కొత్తూరు మండలాల్లో
భారీ ఈదురుగాలులు, వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు
మరి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు
మన తెలంగాణ/తలకొండపల్లి/కొత్తూరు/ హైదరాబాద్: శుక్రవారం కురిసిన అకాల వర్షంతో వడగండ్లతో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కొత్తూరు మండలాల్లో రైతులకు అపార నష్టం సంభవించింది. భారీ ఈదురుగాలులు, వడగండ్ల వ ర్షంతో వరి, మొక్కజొన్నతో మిర్చి, టమా ట, మిరప, బీర పంటలు దెబ్బతిన్నాయి. తలకొండపల్లి మండలంలోని జంగారెడ్డిపల్లి, ఖానాపూర్, చుక్కాపూర్, తలకొండపల్లిలో కురిసిన భారీ వర్షాలవల్ల పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయని రైతు లు వాపోయారు. వడగండ్లు పడడంతో వరి, మి ర్చి, టమాటా పంటలు నేలకొరిగాయి. కాగా, కొత్తూరు మండలంలో ని ఎస్‌బీపల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో కురిసిన వర్షానికి వరి, మిర్చి, టమాట, బీర తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయానికి పంటలు నేలపాలవడంతో రై తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే చేతికందివచ్చే సమయంలో ఇలా అకాల వర్షం తమను ఇక్కట్ల పాల్జేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను ఎంపిపి నిర్మలా శ్రీశైలంగౌడ్ పరిశీలించి, రైతులను ఓదార్చారు. ప్రభుత్వం స్పందించి అన్నివిధాలుగా ఆ దుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రై తులు మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్ట వివరాలు సేకరిం చి నష్ట పరిహారం అందించేలా చూడాలని కోరా రు. కాగా, కొత్తూరు మండలంలో దెబ్బతిన్న పొ లాలను మండల వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. ఎస్‌బీపల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో 46 మంది రైతులకు సంబంధించి వాణిజ్య పంటలకు నష్టం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పం టనష్ట వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే ప్రజలకు ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించినట్లయ్యింది. అయితే ఈ నాలుగు రోజులు కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆకాశమంతా మేఘావృతమై ఉండడంతో తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, ఈ నెల 25వ తేదీ వరకు దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.