Friday, January 24, 2025

రాందేవ్ బాబాకు షాక్…. తప్పుడు యాడ్స్ చేస్తే రూ. కోటి జరిమానా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వ్యాధిని నయం చేస్తామని తప్పుడు యాడ్స్ చేస్తే ప్రతి ఉత్పత్తిపై కోటి రూపాయలు జరిమానా విధిస్తామని యోగా గురువు రాందేవ్‌ను సుప్రీం కోర్టు హెచ్చరించింది. యోగా గురువు రామ్‌దేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద్ అనే సంస్థ టీకా డైవ్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు పతంజలికి నోటీసులు జారీ చేశాయి. తప్పుడు ప్రకటనలతో వ్యాధులను నయం చేస్తామని చెప్పిన పతంజలి సంస్థపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌లో న్యాయమూర్తులు అమానుల్లా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు చేయవద్దని పతంజలిని హెచ్చరించింది. కొన్ని వ్యాధులకు పూర్తి నయం చేస్తామని ఔషధాల గురించి ప్రకటనలు చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంను న్యాయవాదులు కోరారు. ఐఎంఎ దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఫిబ్రవరి 5 వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News