నెమలి, రసంగి పుంజులు బరిలోకి
గెలిచిన నెమలి పుంజు
కోడి పందేన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన పందెం రాయుళ్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి రూపాయల కోడి పందెం పోటీలో గుడివాడ ప్రభాకర్ రావు, రత్తయ్య నెమలి పుంజు, రసంగి పుంజులను బరిలోకి దిగారు. హోరాహోరీగా సాగిన పందెంలో గుడివాడ ప్రభాకర్‌కు చెందిన నెమలి పుంజు గెలిచింది. కోటి రూపాయల కోడి పందేన్ని వీక్షించేందుకు పందెంరాయుళ్లు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
సంక్రాంతి వచ్చిందంటే రత్తయ్య పెంచిన పందెం కోళ్లకు భలే గిరాకీ ఉంటుంది. 20 ఏళ్లుగా పందెం కోళ్లను పెంచుతున్న రత్తయ్య కోళ్లకు పందాల్లో సక్సెస్ రేటు అందరికంటే అధికం. అలాంటి రత్తయ్య పందెం కోడి బరిలో కనీస పోటీ కూడా ఇవ్వకుండానే మట్టి కరవడంతో పందెం రాయుళ్లు భారీగా డబ్బు కోల్పోయిన ట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాలో వందల కోట్ల రూపాయలు బెట్టింగ్‌లో చేతులు మారాయి. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన వారిలో కోడి పందాల మోజులో జేబులు ఖాళీ చేసుకున్న వారు లబోదిబోమంటుండగా, గెలిచినోళ్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఆంధ్రాలో 450 కి పైగా కోడి పందాల బరులు నిర్వహించగా దాదాపు 500 కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిగినట్లుగా సమాచారం.