Wednesday, January 22, 2025

ఏడుపాయల జాతరకు రూ. కోటి మంజూరు

- Advertisement -
- Advertisement -

నిధులు మంజూరులో స్థానిక ఎమ్మెల్యే విశేష కృషి
వైభవంగా జాతర నిర్వహణకు ఏర్పాట్లు

Crore sanctioned to Edupayala jatara
మన తెలంగాణ/పాపన్నపేట : ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిదిలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే మహాజాతర నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రూ. కోటి రూపాయలను మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి యేడాది జాతర నిర్వహణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. ఈ యేడాది కూడా జాతరను అతివైభవంగా నిర్వహించేందుకు రూ. కోటి మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు జీఓఆర్టి నెంబర్ 32, 28 జవనరి 2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా జాతర నిర్వహణ కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అధికారులు ఆదివారం జాతర ఏర్పాట్ల కోసం కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, జిల్లా ఇంచార్జీ మంత్రి తన్నీరు హరీశ్ రావులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిధులతో జాతర భక్తులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా జరిగే ఈ జాతరకు తెలంగాణ ప్రాంత భక్తులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రారల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, ఆర్‌డబ్లుఎస్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య వివిధ శాఖల అధికారులు ముందస్తుగా ఏడుపాయలకు వెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదేశించారు.
నిధులు మంజూరు పట్ల కృతజ్ఞతలు తెలిపిన ఈఒ సార శ్రీనివాస్ :
ఏడుపాయల జాతర నిర్వహణకు రూ. కోటి రూపాయలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలకు ఆలయ ఈవో సార శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News