Sunday, January 19, 2025

తెలంగాణలో విద్యుత్ రంగం బలోపేతానికి కోట్ల నిధుల ఖర్చు

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
  • పరిగిలో ఘనంగా విద్యుత్ ప్రగతి విజయోత్సవాలు

పరిగి: తెలంగాణలోని అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ‘మన తెలంగాణ’ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం పరిగి నియోజకవర్గం స్థాయిలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్‌లో విద్యుత్ ప్రగతి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ రంగం బలోపేతానికి కేసిఆర్ ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేసిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి జీవనాడి వంటి విద్యుత్ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి చేపట్టిన చర్యల వల్ల, 60 ఏళ్ల సమైక్య పాలనలో సాధ్యం కాని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు నేడు తెలంగాణలో నిర్మించబడ్డాయని గుర్తు చేశారు. దీంతో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లకు చేరిందన్నారు. సోలార్ పవర్ జనరేషన్‌లో దేశంలోని అగ్రగామి రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. రైతులకు విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్న ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది అన్నారు.

రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసిందని చెప్పారు. గృహాలకు, వాణిజ్య పరిశ్రమలతో సహా అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. అనంతరం కళాకారులతో పాటలు పాడించారు. మహిళలు బోనాలతో ప్రత్యేక నృత్యాలు నిర్వహించారు. అంతకు ముందు పరిగి విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి బహార్‌పేట్, కొడంగల్ చౌరస్తా మీదుగా ఎస్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ తరుణ్‌కుమార్, మైనార్టీ వెల్ఫర్ అధికారిణి సుధారాణి, పరిగి విద్యుత్ శాఖ ఏడి రామ్మూర్తి, పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, మండలాల ఎంపిపిలు అరవింద్‌రావు, మల్లేశం, సత్యహారిశ్చంద్ర, నవ్యారెడ్డి, వైస్ ఎంపిపి సత్యనారాయణ, మల్లేశం, ఆయా మండలాల జడ్‌పిటిసిలు హారిప్రియా ప్రవీణ్‌రెడ్డి, నాగిరెడ్డి, మేఘమాల, రాందాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిడిఓ శేషగిరిశర్మ, దోమ, పూడూరు ఎంపిడిఓలు జయరాం, ఉమాదేవి, పరిగి విద్యుత్ శాఖ ఏఈ ఖాజా బాబు, ఎంపిఓ దయానంద్, రైతు సమితి మండల కోఆర్డినేటర్లు రాజేందర్, రాజేందర్‌రెడ్డి, ఫీరంపల్లి రాజు, ఏపిఎంలు, ఏపిఓలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News