Monday, December 23, 2024

నాలాల అభివృద్దికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం: తలసాని

- Advertisement -
- Advertisement -

Crores spend for development of canals

మన తెలంగాణ/సిటీ బ్యూరో: వరద ముప్పు సమస్యను శాశ్వతంగా పరిష్కారించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైన వెచ్చించేందుకు సిద్దంగా ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొదటి దశ కింద నగరంలో చేపట్టిన వివిధ నాలాల అభివృద్ది పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఇందులో భాగంగా హిమయాత్‌నగర్ డివిజన్‌లోని దత్తనగర్ నాలా, ముషీరాబాద్, అంబర్‌పేట్ నియెజకవర్గాల్లోని నాగమయ్య కుంట నాలా, హెరిటేజ్ కాంప్లెక్స్ వద్ద గల నాలా, పద్మనగర్ నాలా, పటేల్ నగర్ నాలాల అభివృద్ది పనులను స్థానిక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసానిశ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరంలోని అనేక నాలాలు అక్రమణలకు గురికావడంతోనే ప్రతి ఏటా వర్షాకాలంలో నాలాల గుండా నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో నగరాన్ని వరద ముంచెత్తుంతోందన్నారు.

ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారించేందుకు నాలాల అభివృద్ది శ్రీకారం చుట్టామని, ఇందులో భాగంగా నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గత 50 ఏళ్లగా నగరం ముంపు భారిన పడుతున్నా సమస్య పరిష్కారానికి ఎవరూ ఆలోచించలేదన్నారు. అదే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే ముంపు నివారణ శాశ్వత పరిష్కారానికి ఎస్‌ఎన్‌డిపి పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి తద్వారా నాలాలా అభివృద్ది పనులను మొదలు పెట్టిందని తెలిపారు. సికింద్రాబాద్ జోన్‌లో 8. ఖైరతాబాద్ జోన్‌లో 6 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. నాగమయ్య కుంట పై విఎస్‌టి వద్ద గల నల్ల పోచమ్మ దేవాలయంత పాటు హెరిటేజ్ కాంప్లెక్స్ వద్ద గల నాలాపై రూ.12 కోట్ల వ్యయంతో వంతెనలు వెడల్పుపనులు, పద్మకాలనీ ముంపు నివారణకు గాను రూ.39 కోట్ల వ్యయంతో 902 మీటర్ల మేర నాలా అభివృద్ది పనులు చేపట్టామన్నారు.

అదేవిధంగా మోహిన్ చెరువు నుంచి ఆకాష్ నగర్, చెన్నారెడ్డి నగర్, పోలీస్ లైన్స్ మీదగా మూసీ నది వరకు స్ట్రాం వాటర్ లైన్ నిర్మాణం కోసం రూ.22 కోట్లను వెచ్చించిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులన్ని ఈ ఏడాదిలోపు పూర్తి అవుతాయని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ముంపు సమస్య ఉన్న అన్ని ప్రాంతాల్లో నాలాల అభివృద్ది పనులు చేపడుతున్నామని, ఇందుకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌డిపి ఇఈలు కిషన్, వసంత, వాటర్ వర్క్ ఇఎన్‌సి కృష్ణ, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, సిజిఎం ఆనంద్ నాయక్, కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, సునిత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News