Monday, January 20, 2025

వైకుంఠ ధామానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..

- Advertisement -
- Advertisement -

చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వేచరేని గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి వాగు దాటాల్సిందే. మామూలు రోజుల్లో నైతే కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు ఉండదు. కానీ వర్షాకాలం వచ్చినప్పటికి నీరు ఉధృతంగా ప్రవహించడంతో దహన సంస్కారాలు చేయడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెలితే. వేచరేణి గ్రామానికి చెందిన బసవ రాజు బాలయ్య (75) అనే వృద్ధుడు అనారోగ్య కారణంగా మరణించడంతో అతన్ని దహన సంస్కారాలు చేయడానికి

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుకు అవతలి వైపు ఉన్న వైకుంఠధామానికి తీసుకొని వెళ్లేటప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుపై నుంచి పాడెను మోస్తూ బంధువులు, డప్పు చప్పుళ్ల మధ్య వెలుతున్న దృశ్యానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వాగుపై లో లెవెల్ కాజువే నిర్మించడానికి జనవరిలో కోటి రూ. 96 లక్షలు మంజూరై టెండర్లు పూర్తి అయినప్పటికి కాంట్రాక్ట్ దక్కించుకున్న సదురు కాంట్రాక్టర్ పనులు చేపట్టడం లేదని గ్రామ సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News